11 April 2014

Poem on DREAM's (కలల మీద కవిత)

కలనైనా.....
కనులకు కాటుకదిద్దాను
కలలోకి నీవు వస్తావని...
కనులు నులుముకుని చూసాను
కన్నీరై కరిగిపోయావు ఎందుకని???
కనికరించి నీవు కలలోకి వస్తానన్నావు
కలువరేకులై విచ్చుకున్నాయి కనులు...
కనుల కాంతులను తట్టుకోలేక దూరమైనావు
కలలు అయినాయి సాగరాన్ని తాకని అలలు...
కడకు కమ్మని కలవై కనిపించావు
కలలోనే నన్ను కౌగిలిలో బంధించావు...
కనులార్పకుండా చూడాలనుకున్న నాకు
కనులపై ముద్దాడి కనుమరుగైనావు...

No comments:

Post a Comment