20 April 2014

ప్రేమ తో మీ కోడుకు...

కొత్త వస్తువు నీ కోరిక,
పాత బాకీలు నాన్న అవసరం!
అయినాసరే, నీ నవ్వు కోసం తన అవసరాన్ని పక్కనపెడతాడు.

మనకి రాముడంత రాజ్యంలేకపోవచ్చు,
ఆయనలా వనవాసాలు చేయకపోవచ్చు.
కానీ గౌరవం విషయంలో మన తండ్రి దశరధుడికి ఏమాత్రం తీసీపోడు.

మనం ఎదిగేకొద్దీ తల్లితండ్రులకి వయసవుతూ వుంటుంది.
అప్పుడు వాళ్ళకి మాత్రల కంటే మన తోడు అవసరం!
పురాణాల్లో లక్షల శ్లోకాల కంటే
మనం ప్రేమగా పలకరించే నాలుగు మాటలు అవసరం.

చిన్నప్పటినుండి వాళ్ళ అవసరాలకి చితి అంటించి మరీ,
మన కోరికలకి ప్రాణం పోస్తారు!

మదర్స్ డే, ఫాదర్స్ డే లకి కవిత్వాలు రాయనవసరం లేదు,
సరిగ్గా వేళకి భోజనం చేశారా అని అడిగితే చాలు...
వాళ్ళ కడుపు నిండి పోతుంది!
పుట్టిన రోజు గుర్తుపెట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటే చాలు...
కళ్లు ఆనందం తో తడవుతాయి!



No comments:

Post a Comment