16 April 2014

కూటి కోసం, కూలి కోసం,
పట్టణంలో బ్రతుకుదామని...
తల్లిమాటలు చెవినపెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్క తీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక...
నడిసముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులుపడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే...
చండచండం, తీవ్రతీవ్రం...
జరంకాస్తే, భయంవేస్తే, ప్రలాపిస్తే...
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే,
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం, ఎంత కష్టం !!

No comments:

Post a Comment