20 April 2014

వీరులు,యోధులు...లేదు మీకు చావు

ఎండనక, వాననక, తిండి సరిగ్గా తినక,
ఉన్నచోట ఉండకుండ ఊళ్లెన్నో చుట్టేవు!
పగబట్టిన, పడగెత్తిన పాములాగ బుసకొట్టి
ప్రజావంచకాధములకు సమాధులే కట్టేవు!

అందుకే... 
ఊగరా ఊగరా ఊగరా!
ఉరికొయ్య అందుకొని ఊగరా!
ఉరికొయ్య అంటుకొని ఊగరా!
ఉయ్యాలలాగ బాగా ఊగరా!

సోదరా సోదరా సోదరా!
చావన్నది నీకు లేనే లేదురా!
వీరుడా ధీరుడా శూరుడా!

నువు వేసిన కత్తిగంట్లు గంటల్లా మోగేయి,
నువు వేసిన పొలికేకలు మంటల్లా రేగేయి!
బుద్ధితక్కువ గాడిదలకు పొటాషియం సైనేడువి,
అభిమానుల గుండెల్లో ఆరిపోని హైలైటువి!
తొత్తుకొడుకులెవ్వరికీ దొరక్కుండా తిరిగేవు,
కత్తి దూసి కామాంధుల కుత్తుకలే తరిగేవు!
పేద ప్రజానీకానికి, పీడితులకు, తాడితులకు
చేదోడుగ, వాదోడుగ, సైదోడుగ మెలిగేవు!

అందుకే...

ఊగరా ఊగరా ఊగరా!
ఎన్నటికీ ఆరనిదీ కాగడా!

No comments:

Post a Comment