24 September 2018

మనుషులు మారిపోతారు అనుకోవటం అజ్ఞానం!
ముసుగు తీసి నిజ స్వరూపం చూపిస్తారు అంతే!

ఇది జీవిత సత్యం

02 July 2018

అన్నిటిని అనుభవించాలి

ఆపదకు సంపద నచ్చదు!
సంపదకి  బంధం నచ్చదు!
బంధానికి  బాధ  నచ్చదు!
బాధకు  బ్రతుకు నచ్చదు!
బ్రతుకుకి  చావు నచ్చదు!
చాబుకు పుట్టుక నచ్చదు!
కానీ అన్నిటిని అనుభవించాలి...తప్పదు.

23 January 2017

మాతృభాష పరిరక్షణలో సైనికులు కండి

దేశ భాషలందు తెలుగు లెస్స

తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
ఇదంతా గత వైభవం.... మన ప్రాభవం
వర్తమానం దారుణాతి దారుణం

వాట్సాప్.. పేస్ బుక్ .. సోషల్ మీడియా...
అన్నీ ఇంగ్లీషే... అంతటా ఇంగ్లీషే..
ఇంగ్లీషులో ఆలోచన... ఇంగ్లీషులో మాట..
ఇంగ్లీషులో పలకరింపు.... ఇంగ్లీషు అంటేనే ఓ పులకరింపు...

ఇందుగలదందు లేదని సందేహము వలదు
అన్నట్లుగా తెలుగు సమాజానికి ఇంగ్లీషు వ్యాధి
మాతృభాష మృత‌భాష‌గా మారుతున్న సంద‌ర్భం
తియ్యని తెలుగుకు సోకిన ఇంగ్లీషు తెగులు
ఇది మీకు ఇష్టమా? ఇది మీకు అంగీకారమా..?
ఇలాగే మరో పదేళ్లు గడిస్తే

📰 దిన పత్రికల మనుగడ దినదినగండం అవుతుంది
📺టీవీ ఛానళ్ళు పాతబడిపోతాయి
ఇలాంటి విపరీత, విపత్కర పరిస్థితుల్లో
చివరకు మిగిలేది 😔?

🌐ఇంటెర్నెట్ మాత్రమే... ఈ మాధ్యమంలోనూ తెలుగు భాష అంతంత మాత్రమే.
చైనా, జపాన్,,రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ , సౌదీ అరేబియా... ఇలా  అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటర్నెట్ వాళ్ళ మాతృభాషలో ఉంది.

అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాత్రం ఇంగ్లీషులోనే ఇంటర్ నెట్.
ఈ పరాధీనత ఎన్నాళ్లు... ఈ అలసత్వం ఎన్నాళ్లు..
మాతృభాష తెలుగులోనే ఇంటర్నెట్
మన భాషకు జీవం పోద్దాం
మన భాషకు కీర్తి కిరీటం అలంకరిద్దాం
మన భాషను మనమే విశ్వవ్యాప్తం చేద్దాం
మన భాషలోనే వార్తలు, సినిమా, భక్తి, దృశ్యాలు, గీతాలు, సామెతలు , హాస్యం , కావ్యం, కళలు, సాహిత్యం మీకు తెలుగులో అందించేందుకు
ఆవిర్భవించింది నమస్తే యాప్.
నమస్తే యాప్ డౌన్‌లోడ్ కోసం www.namaste.in వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
మాతృభాష పరిరక్షణలో సైనికులు కండి
🙏నమస్తే....పక్కాలోకల్

మిత్రులారా... బాష అంటే అమ్మ..
అమ్మని పరిరక్షించడం బిడ్డల బాధ్యత
మాతృభాష మరణశయ్యపైకి రాకుండా మీరు బాధ్యత తీసుకోండి
మాతృభాష పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కండి
ఈ  సమాచారాన్ని మీరు ఓ పది మందికి పంపండి
వారిలో ఒక్కోక్కరూ ఒక్కో పది మందికి పంపేలా కోరండి
మన భాషకు పట్టం కట్టడం.. పూర్వవైభవం తీసుకురావడం
తెలుగు వారందరిని కర్తవ్యం... ఇది మనందరి లక్ష్యం..
జై తెలుగు.. జై జై తెలుగు

నమస్తే యాప్.
www.namaste.in

24 May 2016

చాయిస్ నీదే

చాయిస్
అయ్యో, నాజీవితం నాశనమైపోయిందే అనుకుంటే,
అక్కడే ఆగిపోతావ్, దిగాలుపడి...పోతావ్
ఎలాగైనా బాగుపడాలనుకుంటే, 
మళ్ళీ మొదలెడతావ్, ఎదిగి...పోతావ్
పోవడం కామనైనప్పుడు
ఎదిగి పోవాలో, చితికి పోవాలో
చాయిస్ నీదే,
తియ్యరా...బండి...! చెయ్యరా...యుద్ధం...!!
ఓడితే బతుకుతావ్, గెలిస్తే జీవిస్తావ్...
ఆడకుంటే మాత్రం, పోరాడకుంటే మాత్రం
బతుకుతూ చస్తుంటావ్, చస్తూ బతుకుతుంటావ్
అలా బతకడంకంటే, చావడం నయం...
తియ్యరా...బండి
చెయ్యరా...యుద్ధం...!!

23 May 2016

Kavitham ...

జాబిల్లి జలధారని ....... కలంలోకి కురిపించి,
చిగురించే సిరా చుక్కని ...... సరికొత్తగ నడిపించి,
కల కాంచిన మధుజల్లులొ ... ఎద వేసే పరవళ్ళను,
తేనేలాంటి తెలుగులో... తియ్యగా పలికిస్తే
తొలి తొలకరి చినుకులో తడవచ్చు ,,
హరివిల్లులు ఎన్నెన్నో ఒక్కసారి చూడచ్చు ,,
కోయిలతో గొంతు కలిపి పాడచ్చు,,,
మబ్బులతో ముచ్చటగా అంత్యాక్షరి ఆడచ్చు ,,
నింగిలో ఈలలేసి ఊయలలో ఊగచ్చు,,,

ఎవరు నీవు ?

నీ దగ్గిర అన్నీ వున్నప్పుడు,
నిన్ను అందమైన శిల్పం అన్నారు - పొంగిపోయావు!
ఏమీ లేనప్పుడు,
నిన్ను పనికిరాని శిథిలం అన్నారు - కృంగిపోయావు!
నిజానికి నువ్వు శిల్పం కాదు, శిథిలమూ కాదు...
ఏ కోణం కొలవలేని వృత్తానివి, ఏ అభిప్రాయానికి చిక్కని అనంతానివి!
చెక్కితే రాయి శిల్పం అవుతుంది, కూల్చితే కొండ శిథిలం అవుతుంది.
కానీ, నీ భయాన్ని ఎదిరించిన నీ ధైర్యమే, అనంతం అవుతుంది!
మిణుకు మిణుకుమంటూ రోజూ బ్రతుకునీడ్చే బల్బు కంటే,
ఒక్కసారి జివ్వున వెలిగి ఆరిపోయే నిప్పురవ్వే గొప్పది!
అభిప్రాయాల సంకెళ్ళని తెంచుకుని,
మనస్సాక్షి అనే మాలని ధరించు!
సుఖం సంగతి నాకు తెలీదు కానీ,
సంతోషం మాత్రం నిన్ను వెంటాడుతూ వస్తుంది - కౌగిలించుకోమని! 

22 May 2016

స్వార్ధం ఎందుకు ?

కురిసే వానకు స్వార్ధం లేదు...
పండే పంటకు స్వార్ధం లేదు...
నింగికీ నేలకీ లేని స్వార్ధం,
మధ్యన ఉన్న మనిషికెందుకు?
పుట్టినప్పుడు పట్టుకురాడు...
పోయేటప్పుడు పట్టుకుపోడు...
మూడునాళ్ళ ముచ్చట కోసం,
ఈ మోసాలెందుకు ద్వేషాలెందుకు?