03 June 2014

కళ్ళు నెత్తికెక్కడమంటే ??

బయట అధికారం వుంటుంది, ధనముంటుంది, బంగారు వుంటుంది...
కానీ అవేవీ మన లోపలికి వెళ్ళలేవు.

కానీ వాటికి సంబంధించిన ‘నాది, నావి’ అన్న భావన -
అహంకారంగా తలలో పేరుకుంటుంది. 
ఫలితంగా యితర్లని తక్కువ చేసే తత్వం తలకెక్కుతుంది. 
పొగరుమోతుతనం వస్తుంది.

కళ్ళు నెత్తికెక్కడమంటే అదే.....

Respect women _/\_

ఆడదానిని వేధించడం,
అమ్మని వేధించడం ఒక్కటే!
మనిషిలా పుట్టడం కాదు,
మనిషిలా బ్రతకడం నేర్చుకోరా!
నిన్ను చూసి భారతావని తలదించుకుంటుంది!

తెలంగాణా ఆవిర్భావ దినోస్తవ శుభాకాంక్షాలు!!!

గద్దర్ పాటలిన్నాం. 
గోరేటి వెంకన్న గొంతు విన్నాం.
బలైపోయిన కుర్రాళ్ళ గోడు చూసాం.
జయశంకర్ ఆశయాల పోరు కన్నాం.
కె.సి.ఆర్. అలుగుడు చూసాం.
తెలంగాణ సాధనకి కోటి రతనాల వీణ అయిన ప్రతి వాడి గుండె నాడి వేడి తాకి చూసాం.
సంబరాల వెలుగులో గల్లి గల్లి మొహల్లా చౌరాస్తా మెరుపులు చూసేసాం.

పోరాడి తెచ్చుకున్న పండు బాగుంది సరే - 
మరి ఆ రాళ్ళ దెబ్బలకి విరిగిపోయిన కొమ్మలతో, రాలిపోయిన ఆకులతో,
కూలిపోతున్న చెట్టుని ఒక్కసారి పట్టించుకోండర్రా.

దాని పేరు మిగిలిపోయిన పగిలిపోయిన పిగిలిపోయిన సీమాంధ్ర...

"తెలంగాణా" ప్రజలందరికి తెలంగాణా ఆవిర్భావ దినోస్తవ శుభాకాంక్షాలు!