26 April 2014

Shree Durga Ashtothram

Om Drugayai Namaha 
Om Shivayai Namaha 
Om Maha Lakshmyai Namaha 
Om Maha Gouryai Namaha 
Om Chandikaye Namaha 
Om Sarva Gynayai Namaha 
Om Sarva Lokeshayai Namaha 
Om Sarva Karma Phala Pradayai Namaha 
Om Sarva Teerdha Mayai Namaha 
Om Pun Yayai Namaha 
Om Deva Yonaye Namaha 
Om Ayoni Jaayai Namaha 
Om Bhume Jaayai Namaha 
Om Nirgu Nayai Namaha 
Om Aadhara Shaktyai Namaha 
Om Aanee Shvaryai Namaha 
Om Nirgu Nayai Namaha 
Om Niramham Karayai Namaha 
Om Sarva Garva Vimar Dhinyai Namaha 
Om Sarva Loka Priyayai Namaha 
Om Vaanyai Namaha 
Om Sarva Vidyadhi Devataayai Namaha 
Om Parvatyai Namaha 
Om Devamatre Namaha 
Om Vanee Shayai Namaha 
Om Vindya Vasinyai Namaha 
Om Tejo Vatyai Namaha 
Om Maha Matre Namaha 
Om Koti Surya Sama Prabhayai Namaha 
Om Deva Tayai Namaha 
Om Vahni Rupayai Namaha 
Om Sate Jase Namaha 
Om Varna Rupinyai Namaha 
Om Guna Shayayai Namaha 
Om Guna Madhyayai Namaha 
Om Guna Traya Vivarji Tayai Namaha 
Om Karma Gynana Pradayai Namaha 
Om Kantayai Namaha 
Om Sarva Samhara Karinyai Namaha 
Om Dharma Gynanayai Namaha 
Om Dharma Nistayai Namaha 
Om Sarva Karma Vivardhi Tayai Namaha 
Om Kamakshmai Namaha 
Om Kama Samhartyai Namaha 
Om Kama Krodha Vivarji Tayai Namaha 
Om Shan Karyai Namaha 
Om Sham Bhavyai Namaha 
Om Shan Tayai Namaha 
Om Chandra Suryagni Lochanayai Namaha 
Om Suja Yayai Namaha 
Om Jaya Bhumi Shtayai Namaha 
Om Jaahnavyai Namaha 
Om Jana Puji Tayai Namaha 
Om Shastrasyai Namaha 
Om Shastra Mayyai Namaha 
Om Nityayai Namaha 
Om Shubhayai Namaha 
Om Chandhrardha Mastakayai Namaha 
Om Bharatyai Namaha 
Om Bramaryai Namaha 
Om Kalpayai Namaha 
Om Karalyai Namaha 
Om Krushana Pingalayai Namaha 
Om Bramhai Namaha 
Om Narayanyai Namaha 
Om Roudryai Namaha 
Om Chandra Mruta Pari Srutayai Namaha 
Om Jyeshtayai Namaha 
Om Indirayai Namaha 
Om Maha Mayayai Namaha 
Om Jagat Grushtya Dhika Rinyai Namaha 
Om Bramhanda Koti Samsdha Nayai Namaha 
Om Kaminyai Namaha 
Om Kamalaa Layayai Namaha 
Om Katya Yanyai Namaha 
Om Kalaa Teetayai Namaha 
Om Kala Samhara Karinyai Namaha 
Om Yoga Nishtayai Namaha 
Om Yogi Gamyayai Namaha 
Om Yogi Dyeyayai Namaha 
Om Tapa Svinyai Namaha 
Om Gynana Pupayai Namaha 
Om Niraka Rayai Namaha 
Om Bhakta Bhishta Phala Pradayai Namaha 
Om Bhutatme Kayai Namaha 
Om Bhuta Matre Namaha 
Om Bhute Shyai Namaha 
Om Bhuta Darinyai Namaha 
Om Svadhayai Namaha 
Om Naree Madhya Gatayai Namaha 
Om Shada Dharadi Vardhinyai Namaha 
Om Mohitam Shubha Dayai Namaha 
Om Shubhrayai Namaha 
Om Sukshmayai Namaha 
Om Matrayai Namaha 
Om Nirala Sayai Namaha 
Om Nimna Gayai Namaha 
Om Neela Samka Shayai Namaha 
Om Nitya Nandayai Namaha 
Om Harayai Namaha 
Om Paraayai Namaha 
Om Sarva Gynana Pradayai Namaha 
Om Anamtayai Namaha 
Om Satyayai Namaha 
Om Durlabha Rupinyai Namaha 
Om Sarasvatyai Namaha 
Om Sarva Gatayai Namaha 
Om Sarva Bheeshta Prada Inyai Namaha 

20 April 2014

వీరులు,యోధులు...లేదు మీకు చావు

ఎండనక, వాననక, తిండి సరిగ్గా తినక,
ఉన్నచోట ఉండకుండ ఊళ్లెన్నో చుట్టేవు!
పగబట్టిన, పడగెత్తిన పాములాగ బుసకొట్టి
ప్రజావంచకాధములకు సమాధులే కట్టేవు!

అందుకే... 
ఊగరా ఊగరా ఊగరా!
ఉరికొయ్య అందుకొని ఊగరా!
ఉరికొయ్య అంటుకొని ఊగరా!
ఉయ్యాలలాగ బాగా ఊగరా!

సోదరా సోదరా సోదరా!
చావన్నది నీకు లేనే లేదురా!
వీరుడా ధీరుడా శూరుడా!

నువు వేసిన కత్తిగంట్లు గంటల్లా మోగేయి,
నువు వేసిన పొలికేకలు మంటల్లా రేగేయి!
బుద్ధితక్కువ గాడిదలకు పొటాషియం సైనేడువి,
అభిమానుల గుండెల్లో ఆరిపోని హైలైటువి!
తొత్తుకొడుకులెవ్వరికీ దొరక్కుండా తిరిగేవు,
కత్తి దూసి కామాంధుల కుత్తుకలే తరిగేవు!
పేద ప్రజానీకానికి, పీడితులకు, తాడితులకు
చేదోడుగ, వాదోడుగ, సైదోడుగ మెలిగేవు!

అందుకే...

ఊగరా ఊగరా ఊగరా!
ఎన్నటికీ ఆరనిదీ కాగడా!

ప్రేమ తో మీ కోడుకు...

కొత్త వస్తువు నీ కోరిక,
పాత బాకీలు నాన్న అవసరం!
అయినాసరే, నీ నవ్వు కోసం తన అవసరాన్ని పక్కనపెడతాడు.

మనకి రాముడంత రాజ్యంలేకపోవచ్చు,
ఆయనలా వనవాసాలు చేయకపోవచ్చు.
కానీ గౌరవం విషయంలో మన తండ్రి దశరధుడికి ఏమాత్రం తీసీపోడు.

మనం ఎదిగేకొద్దీ తల్లితండ్రులకి వయసవుతూ వుంటుంది.
అప్పుడు వాళ్ళకి మాత్రల కంటే మన తోడు అవసరం!
పురాణాల్లో లక్షల శ్లోకాల కంటే
మనం ప్రేమగా పలకరించే నాలుగు మాటలు అవసరం.

చిన్నప్పటినుండి వాళ్ళ అవసరాలకి చితి అంటించి మరీ,
మన కోరికలకి ప్రాణం పోస్తారు!

మదర్స్ డే, ఫాదర్స్ డే లకి కవిత్వాలు రాయనవసరం లేదు,
సరిగ్గా వేళకి భోజనం చేశారా అని అడిగితే చాలు...
వాళ్ళ కడుపు నిండి పోతుంది!
పుట్టిన రోజు గుర్తుపెట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటే చాలు...
కళ్లు ఆనందం తో తడవుతాయి!



16 April 2014

ప్రయాణం

అలల ప్రయాణం తీరం వరకే
మెరుపు ప్రయాణం మెరిసే వరకే
మెఘ ప్రయాణం కురిసే వరకే
కలల ప్రయాణం మెలుకువ వరకే
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే
కానీ స్నేహ ప్రయాణం కడ వరకూ...

కూటి కోసం, కూలి కోసం,
పట్టణంలో బ్రతుకుదామని...
తల్లిమాటలు చెవినపెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్క తీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక...
నడిసముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులుపడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే...
చండచండం, తీవ్రతీవ్రం...
జరంకాస్తే, భయంవేస్తే, ప్రలాపిస్తే...
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే,
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం, ఎంత కష్టం !!

14 April 2014

Love

U Hurted me......... I was Silent
U Broke my Heart......... I was Silent
U Ignored me ........... I was silent
BUT
When U left me ............I BruSted into Tears
Bcoz I hurt more
Than........... ­I Deserve

12 April 2014

తల్లి ప్రేమ

స్రుష్టిలో కరగనిది తరగనిది
మరెందులోనూ కనిపించనిది
భూమి కన్నా విశాలమయినది
చందమామ కన్నా చల్లనయినది
సూర్యిని కన్నా ప్రకాశవంతమయినది
ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి
అదే తల్లి ప్రేమ.. దీనిని ఏ సిరితో అయినా కొలవగలమా..

నీవెవరు ?

శ్వాసనడిగా నువ్వేమిటని ?
గమ్యమెరుగని గాలిని చేరదీసే చెలికాడిని నెనంది.
చూపునడిగా నివెవ్వరని ?
నీవు చూసే ప్రతిరూపు నెనంది.
మాటనదిగా నీ పని ఏమిటని ?
ఎల్లలెరుగని స్నేహభందానికి యజమానిని నేనంది.
చేతినడిగా నీ గొప్పేమిటని ?
ఊతమడిగిన సహ హ్రుదయానికి చేసే ఉపకారం నా గొప్పంది.
అడుగునడిగా అసలు నీ పొగరేమిటని ?
ఖ్యాతికెక్కిన జాతి ధనులనుసరించే భాగ్యం నాదిమాత్రమేనంది.
ఊహనడిగా నీ కెంతుకింత ఉలుకని ?
జగతి హ్రుదయులనేలు భారత జాతి ప్రాభవాన్ని ఊహిస్తున్నందుకంది.
మనసునడిగా అంబరమంటే సంబరమెందుకని ?
భరత మాత బిడ్డననే తలపులు నన్ను తాకుతున్నదువల్లెనంది.

కరిగిపొయిన కాలంలా..

కరిగిపొయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
తలచి తలచి నిలిచిపొతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకిష్టమయిన గతం
ఆగిపోదెన్నడూ వర్తమానం
మరెందుకు తిరిగిరానివాటి గురించి నీకెందుకింత ఆరాటం
అనుభవించు కష్టమయినా నష్టమయినా ఈ జీవితం.

11 April 2014

దూరమవ్వకే ప్రేమ.......

నా అనురాగం నీకు అనర్దంగా...,
నా ప్రేమ నీకు అనుమానంగా...,
నా బాధ్యత నీకు భారంగా...,
నా స్నేహం నీకు అనవసరంగా  అనిపిస్తున్నపుడు....,
నేను నీ కల్లముందు వుండటమ్ కన్నా, కనుమరుగవడమే మేలు...,
                 ఎందుకంటే..
నీకు దగ్గర కాలేకపోయినా భరించగలను...కాని
నీపై నాకున్నప్రేమకు  దూరమవడమ్ ఊహించలేను.........,!

ఎవరివవో నీ వేవరివో ....!!

నేస్తమా  నీవు ...!!   
నా కలల కొలనులో  విరిసిన   కమలానివో.., 
నా హృదయ విపంచిని మీటిన మృదు మంజరివో ..,
నా ఊహల వుయలను వూపె  విరి భోనివో ..,
నా మనసు మందిరం లో వెలిగే చిరు దివ్వేవో ..,
           ఎవరివవో    నీ వేవరివో ....!!
నా ఆశల సౌదానికి ఆయువు నింపే ఆమనివో ..,  
నా  కనులకు వెలుగును నింపే కాంతి రువానమువో ..,
నా ఎడారి జీవితానికి  చిరు జల్లువో ..,
నా కోసమే నడిచి వచ్చిన  నాట్య మయురానివో..,
            ఎవరివో   నీ వేవరివో ....!!    

Poem on DREAM's (కలల మీద కవిత)

కలనైనా.....
కనులకు కాటుకదిద్దాను
కలలోకి నీవు వస్తావని...
కనులు నులుముకుని చూసాను
కన్నీరై కరిగిపోయావు ఎందుకని???
కనికరించి నీవు కలలోకి వస్తానన్నావు
కలువరేకులై విచ్చుకున్నాయి కనులు...
కనుల కాంతులను తట్టుకోలేక దూరమైనావు
కలలు అయినాయి సాగరాన్ని తాకని అలలు...
కడకు కమ్మని కలవై కనిపించావు
కలలోనే నన్ను కౌగిలిలో బంధించావు...
కనులార్పకుండా చూడాలనుకున్న నాకు
కనులపై ముద్దాడి కనుమరుగైనావు...

10 April 2014

ప్రేమలో ఓడిపోతే

ప్రేమలో ఓడిపోతే అబ్బాయి బాధ కళ్ళల్లో
కనిపిస్తుంది,
లేదా,
తాగి పడేసిన మందు బాటిల్స్ సంఖ్యలో కనిపిస్తుంది...
అదే అమ్మాయి ఓడిపోతే తన బాధను గుండెల్లో దాచుకుంటుంది...
కళ్ళల్లో కనిపించే బాధ కన్నీటితో పాటే
కరిగిపోతుంది
కానీ మనసులో దాచుకున్న బాధ తన మరణం
దాకా ఉండిపోతుంది

08 April 2014

శ్రీరామనవమి శుభాకాంక్షలు


పూజా తపముల మరి నేనెరుగను, మరి నేనెరుగను హారతి!
రాముని సలలిత పాధరణములే ప్రభుని నామమే కోరితి!

కలలోను రాముడే, నా కనులందు రాముడే,
ధరణీ గగనము మీద ప్రభువైన రాముడే!

ప్రభుడే ఈ సూర్యకాంతి, ప్రభుడే ఈ చంద్రిక,
కెరటాల పూలమాల ప్రభుని లలంతిక!
చరాచరలోకమంతా రఘువరుడా రాముడే!

ప్రతి పూవులో ఉన్నాడు, ప్రతి కొమ్మ రెమ్మలో రామమంత్రం!
జపియించు మంత్రమే మదిన్ రోజు రోజు నేను, చేతున్ ప్రణామమే!

ఓలాడేను నా హృదయమ్మే రేయి పవళ్ళు పులకించి,
ఓలాడేను పరవశమై మది వాని రూపమే తిలకించి!

అతని కరుణచే పాషాణములే కరిగి నదులుగా ప్రవహించు,
వాని దయచే మరు భూములలో జాజి మల్లెలే వికసించు!

అతడే అనాధల బ్రోచే విభుడా శ్రీరాముడి ధరణీ, 
దయానిధి రాముడే... 
రామ రామ రామ జయ జయ రామ రామ రాం,
రామ్ రామ్ రామ్!

శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఆదియు తానే అంతము తానే,
శ్రీ రాముడే అణువణువందూ!

యుగముల్ పోనీ యుగముల్ రానీ,
అమరము కాదా ప్రభునామమ్!

రఘుపతి రాఘవ రాజారాం,
పతిత పావన సీతారాం!

మది తలచెదనూ కోరి కొలిచెదనూ
మధురము కాదా రామ నామమే!


07 April 2014

మహాప్రస్థానం (కవిత)

మరో ప్రపంచం,

మరో ప్రపంచం,

మరో ప్రపంచం పిలిచింది!

పదండి ముందుకు,

పదండి త్రోసుకు!

పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,

పదం పాడుతూ,

హ్రుదాంతరాళం గర్జిస్తూ-

పదండి పోదాం,

వినబడలేదా

మరో ప్రపంచపు జలపాతం?

దారిపొడుగునా గుండె నెత్తురులు

తర్పణ చేస్తూ పదండి ముందుకు!

బాటలు నడచీ,

పేటలు కడచీ,

కోటలన్నిటిని దాటండి!

నదీ నదాలూ,

అడవులు, కొండలు,

ఎడారులా మన కడ్డంకి?

పదండి ముందుకు!

పదండి త్రోసుకు!

పోదాం, పోదాం, పైపైకి!

ఎముకులు క్రుళ్ళిన,

వయస్సు మళ్ళిన

సోమరులారా! చావండి!

నెత్తురు మండే,

శక్తులు నిండే,

సైనికులారా! రారండి!

"హరోం! హరోం హర!

హర! హర! హర! హర!

హరోం హరా!" అని కదలండి!

మరో ప్రపంచం,

మహా ప్రపంచం

ధరిత్రినిండా నిండింది!

పదండి ముందుకు,

పదండి త్రోసుకు!

ప్రభంజనంవలె హోరెత్తండీ!

భావ వేగమున ప్రసరించండీ!

వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె

పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!

పదండి,

పదండి,

పదండి ముందుకు!

కనబడలేదా మరో ప్రపంచపు

కణకణమండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి

ఎనభై లక్షల మేరువులు!

తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్

జలప్రళయ నాట్యం చేస్తున్నవి!

సలసలక్రాగే చమురా? కాదిది

ఉష్ణరక్త కాసారం!

శివసముద్రమూ,

నయాగరావలె

ఉరకండీ! ఉరకండీ ముందుకు!

పదండి ముందుకు!

పదండి త్రోసుకు!

మరో ప్రపంచపు కంచు నగారా

విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,

రేచులవలనూ,

ధనంజయునిలా సాగండి!

కనబడలేదా మరో ప్రపంచపు

అగ్నికిరీటపు ధగధగలు,

ఎర్రబావుటా నిగనిగలు,

హోమజ్వాలల భుగభుగలు?
దేశంలోనయినా,ఏ భాషలోనయినా మాటలు కవిత్వంగా మారినప్పుడు వాటికి రెక్కలు వస్తాయి.
అవి వినువీధులలో అనంతంగా విహరిస్తుంటాయి,అలాగని వాటికి మన భూమితో సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు.
 ఒక సందులోనో, ఒక ఊరిలోనో కాక మొత్తం ప్రపంచం అంతటా జరిగే దురాగతాల నవి కనిపెడుతూ ఉంటాయి.
 ఆ దుర్మార్గాలను బహిర్గతం చెయ్యడమే కాదు, అలాంటివి మళ్ళా జరక్కుండా పరిష్కారాన్ని కూడా సూచిస్తాయి.
         - శ్రీ శ్రీ