23 May 2014

స్వాతంత్ర్యం – శ్రీశ్రీ

నా స్కూలు కాపీబుక్కు మీద, బల్ల మీద,
చెట్లు మీద, ఇసుక మీద, మంచు మీద,
నీ పేరే రాస్తాను!
చదివిన ప్రతి పేజీ మీద, తెల్లని ప్రతి కాగితం మీద,
రాయి రక్తం అట్ట మీద, బుగ్గి మీద,
నీ పేరే రాస్తాను!
తళుకు బెళుకు భ్రమల మీద, సిపాయిల తుపాకుల మీద,
మహారాజుల కిరీటాల మీద,
నీ పేరే రాస్తాను!
అడవి మీద, ఎడారి మీద, పిట్టగూళ్ళ మీద,
చీపురుకట్టల మీద, శిశుత్వపు ప్రతిధ్వనుల మీద,
నీ పేరే రాస్తాను!
చిత్రమైన రాత్రుల మీద, పగళ్ళ తెల్లని వేడి అన్నం మీద,
పెళ్లి మాటలాడుతున్న ఋతువుల మీద,
నీ పేరే రాస్తాను!
నా వినీలాకాశపు చింకిపాతల మీద,
చెరువులోని సూర్యుని మీద, చంద్రుని సజీవ సరోవరం మీద,
నీ పేరే రాస్తాను!
ప్రపంచపుటంచున పంటపొలాల మీద,
పక్షుల రెక్కల మీద, నీడల గాలితిరుగుడు మరల మీద,
నీ పేరే రాస్తాను!
ఉదయిస్తున్న ప్రతి పవనాంకురం మీద, నా కలం మీద,
సముద్రం మీద, వెర్రెత్తిన పర్వతం మీద,
నీ పేరే రాస్తాను!
మబ్బుగుంపుల నాచు మీద, తుఫానుల చెమట మీద,
రుచిలేని చిక్కటి వాన మీద,
నీ పేరే రాస్తాను!
రంగు రంగుల రూపాల మీద, ఇంద్రధనుస్సు గంటల మీద,
స్పర్శించదగిన సత్యం మీద,
నీ పేరే రాస్తాను!
మేలుకొంటున్న సందుల మీద, విస్తరిల్లుతున్న వీధుల మీద,
శ్రుంగాటకాల వరదల మీద,
నీ పేరే రాస్తాను!
వెలిగించిన దీపం మీద, మరణించే దీపం మీద,
మళ్ళీ కలుసుకున్న మా ఇళ్ళ మీద,
నీ పేరే రాస్తాను!
రెండుగా తరగిన పండు మీద, గదిలో ఉన్న నా అద్దం మీద,
శూన్యమైన నా శయ్యాశంఖం మీద,
నీ పేరే రాస్తాను!
నా కుక్కపిల్ల గూటి మీద, రిక్కించిన దాని చెవుల మీద,
దాని అడ్డదిడ్దపు పాడమ మీద,
నీ పేరే రాస్తాను!
కిర్రుమనే తలుపు మీద, పవిత్రాగ్నుల కెరటం మీద,
నాకు తెలిసిన, నేను ప్రేమించిన వస్తువు మీద,
నీ పేరే రాస్తాను!
శ్రావ్యమైన శరీరం మీద, స్నేహితుల ముఖాల మీద,
చాచిన ప్రతి హస్తం మీద, నీ పేరే రాస్తాను!
వింతైన కిటికీ అద్దం మీద,
నిశ్సబ్దానికి చాలా అవతల పెదవులపై నిలిచే ఏకాగ్రత మీద,
నీ పేరే రాస్తాను!
నా కూలిపోయిన గుడిసె మీద, పడిపోయిన దీపగృహల మీద,
నా విసుగుదల గోడల మీద,
నీ పేరే రాస్తాను!
కోరికలేని అదృశ్యత మీద, నగ్నమైన ఒంటరితనం మీద,
మరణపు సరిహద్దుల మీద,
నీ పేరే రాస్తాను!
ఇప్పుడే కోలుకుంటున్న ఆరోగ్యం మీద,
నిష్క్రమించిన ప్రమాదం మీద, జ్ఞాపకం లేని ఆశ మీద,
నీ పేరే రాస్తాను!
ఒక్క శబ్దం శక్తి వల్ల నా బ్రతుక్కి పునర్జన్మ!
నేనెందుకు జన్మించానా?
నిన్ను తెలుసుకోవాలని!
నీ మననం, నా జననం – స్వాతంత్ర్యం!

10 May 2014

మదర్స్ డే.ఇదీ కాదు మన దేశ సంస్కృతి !!!

ఈ రోజు మదర్స్ డే అని అందరు బాగానే పోస్ట్ లు పెడ్తునారు !!!
ఎవడో విదేశీయుడు కాళీ చూస్కొని మే నెల లో 2వ ఆదివారం
మదర్స్ డే అనే సరి కి ఎగబడి విషెస్ చెబుతున్నారు మరి
మిగిలిన 364 రోజుల పరిస్థితి ..????
మన దేశ సంస్కృతి కానిది ఏదైన మనం దానిని
నిషేధించాలి ఒక్క సరి అందరు ఆలోచించండి
అమ్మ నాన్న లను మనం నిజంగా ప్రేమించి
గౌరవం ఇస్తే ఎందుకు వృద్ధ ఆశ్రమాలు వుంటై ..????
ఆలోచించండి !!!!!  

Happy Mothers day

"ఎన్ని యుగాలు మారిన..
ఎన్ని తరాలు దాటినా..
మారని మాధుర్యం అమ్మ ప్రేమ..
ఏ దేసమేగిన..
ఏ తీరం దాటినా...
మరువని మమకారం అమ్మ ప్రేమ..
ప్రకృతి చేసిన బంగారు ప్రతిమా..
ప్రతి గుండె చేసే సడిలోన భావమా..
పాదాభివందనం నీకమ్మ..
ఈ పదాల వందనం నీకోసం అమ్మ..." 

08 May 2014

ఈశ్వరా! నువ్వసలు ఉన్నావా?

ఈశ్వరా! నువ్వసలు ఉన్నావా?
నువ్వు ఉండి కూడా....
ప్రజలలో యీ మూర్ఖం, యీ అన్యాయం,
యీ రోగాలూ, మరణాలూ, యుద్ధాలూ, విలాసాలూ?
ఏమి సంతోషం నీకు? నువ్వు రాక్షసుడివా?
నీ కళ్ళూ, చెవులూ చెదలు పట్టాయా?
ప్రపంచం లోని నిరంతర భయంకర రోదన వినబడడం లేదా?

నోరు లేని పశువులు పడే దినదిన బాధ,
దిక్కు లేని పసి పిల్లలు పడే నరక బాధ,
పంజరాల్లో పిట్టలు పొందే చెప్పలేని నరాల బాధ,

ఎందుకు? పాములూ, వరదలూ, భూకంపాలూ ఎందుకు?

ధనమూ, జ్ఞానమూ అన్నీ దాచుకుని, నిర్భాగ్యుల్ని పీడించి -
నువ్వేనా ఆ నీతి చట్టాలనూ, శాస్త్రాలనూ కల్పించింది?
ఆ నీతి పేర ప్రజల్ని దండించి, నలిపి నాశనం చేసే వారికి ఏం శిక్ష?
నరకమని భయపెట్టి, తప్పుడు పనులు చేయించి -
ప్రేమను, ఔదార్యాన్ని నొక్కి నాశనం చేసే వారికి ఏం శిక్ష?


05 May 2014

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం కలలే పండిన వైభోగం...
అనురాగం అభిమానం చక్కని జంటకు శతమానం...
wishing a happy married life to singer Chinmayi Sripada andRahul Ravindran

"చార్లీ చాప్లిన్‌" కాలే కడుపు!

నేటి చిట్టి కధ - "చార్లీ చాప్లిన్‌" కాలే కడుపు!
-----------------------------------------

ఒక మహానుభావుడు తన పసితనంలో ఆకలిని మరిచిపోడానికి - 
పార్కులో కడుపునిండా మంచినీళ్లు తాగి, 
మరిపించడానికి గట్టిగా పాటలు పాడి, గెంతులు గెంతి.... 
ఆ గెంతుల్ని కళగా మలిచాడు - ఉపాధికోసం బారుల్లో పాటపాడుతూ!

కేవలం కాలే కడుపు కారణంగా గొంతుపోయిన తన తల్లిని,
తాగుబోతులు అల్లరి చేస్తూంటే ఆమెని కాపాడడానికి పసితనంలోనే...
స్టేజిమీదకు దూకి, ఆమె పాడిన పాటలు పాడి సభికుల్ని మెప్పించాడు. 
తను కళాకారుడు కావడం - కళకోసం కాదు, పట్టెడన్నం కోసమని చెప్పాడు!

కష్టానికి కన్నీటికి కొత్త కోణాన్ని, కొత్త రుచినీ చూపిన ఆ మహానటుడు - 
"చార్లీ చాప్లిన్‌"

జీవితం ఎవరికీ వొడ్డించిన విస్తరి కాదు.
మన సామర్థ్యం, వాతావరణం, సమాజం, కుటుంబం, పరిస్థితులూ -
యివన్నీ సమష్టిగా జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గానో, ఒక పరీక్షగానో నిలపవచ్చు. 
చికిత్స కు రెండే రెండు సాధనాలు - 
తట్టుకునే సంకల్పబలం, చిత్తశుద్ధి. 
విజయానికి ఏనాడూ దగ్గర తోవలేదు. 
వ్యక్తిగతమైన కష్టానికి నిస్పృహ కాలకూటవిషం. 
నిర్వీర్యత అపజయానికి తొలిమెట్టు....

02 May 2014

ఎందుకిలా .........

ఎందుకిలా నను వేదిస్తున్నావే
ఎందుకని నను వెలి వేస్తున్నావే
నా హృదయం నీతోడే కోరుకున్దనా
నా ప్రాణం నీ చుట్టూ తిరిగుతున్దనా 
అన్యాయంగా తోస్తుంటే నట్టేటిలో ఇలా
నేనేమయి పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం.
ఎందుకిలా నను వేదిస్తున్నావే
ఎందుకని నను వెలి వేస్తున్నావే
నన్నే నే వదిలేసి నువ్వే కావాలంటున్న
నాదంటూ మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్న
నే న్నీకు వద్దని నీతో నడవద్దని
నీ దారే నీదని గీసావా గీతని
నీ గుండెల్లోన గుర్తుల్ని నన్నే తాకిన అలలా తుడిచేస్తే
నేనేమయి పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం.
వెలుగంతా తరిమేసి చీకటిలో నను తోస్తావా
గతమంతా చెరిపేసి శూన్యం లో నిలబెడతావా
నాకన్నీ నువ్వని అనుకోడం పాపమా
పూజించే చేతిని నరికెంత కోపమా
నీ తలపుల్లో మై మరపుల్లొ నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే
నేనేమయి పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం.
ఎందుకిలా నను వేదిస్తున్నావే
ఎందుకని నను వెలి వేస్తున్నావే