నేటి చిట్టి కధ - "చార్లీ చాప్లిన్" కాలే కడుపు!
-------------------------- ---------------
--------------------------
ఒక మహానుభావుడు తన పసితనంలో ఆకలిని మరిచిపోడానికి -
పార్కులో కడుపునిండా మంచినీళ్లు తాగి,
మరిపించడానికి గట్టిగా పాటలు పాడి, గెంతులు గెంతి....
ఆ గెంతుల్ని కళగా మలిచాడు - ఉపాధికోసం బారుల్లో పాటపాడుతూ!
కేవలం కాలే కడుపు కారణంగా గొంతుపోయిన తన తల్లిని,
తాగుబోతులు అల్లరి చేస్తూంటే ఆమెని కాపాడడానికి పసితనంలోనే...
స్టేజిమీదకు దూకి, ఆమె పాడిన పాటలు పాడి సభికుల్ని మెప్పించాడు.
తను కళాకారుడు కావడం - కళకోసం కాదు, పట్టెడన్నం కోసమని చెప్పాడు!
కష్టానికి కన్నీటికి కొత్త కోణాన్ని, కొత్త రుచినీ చూపిన ఆ మహానటుడు -
"చార్లీ చాప్లిన్"
జీవితం ఎవరికీ వొడ్డించిన విస్తరి కాదు.
మన సామర్థ్యం, వాతావరణం, సమాజం, కుటుంబం, పరిస్థితులూ -
యివన్నీ సమష్టిగా జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గానో, ఒక పరీక్షగానో నిలపవచ్చు.
చికిత్స కు రెండే రెండు సాధనాలు -
తట్టుకునే సంకల్పబలం, చిత్తశుద్ధి.
విజయానికి ఏనాడూ దగ్గర తోవలేదు.
వ్యక్తిగతమైన కష్టానికి నిస్పృహ కాలకూటవిషం.
నిర్వీర్యత అపజయానికి తొలిమెట్టు....
No comments:
Post a Comment